న్యూఢిల్లీ : తన ఆచూకీపై తీవ్రమైన ఒత్తిడి, ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ ఉపప్రధాని, తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘని బరాదర్ తాజాగా ఒక వీడియో సందేశం విడుదల చేశారు.
రాజకీయ ప్రత్యర్థుల కాల్పుల్లో బరాదర్ మరణించాడని వచ్చిన వార్తలను తాలిబన్ సోమవారం ఖండించింది. బరాదర్ కాందహార్ ప్రావిన్స్‌లో ఉన్నాడని, తాలిబన్ సుప్రీం నేత మౌలావి హిబతుల్లా అఖుంద్‌్‌జాదాతో సమావేశమై ఆఫ్టనిస్తాన్ భవిష్యత్తు గురించి చర్చలు జరుపుతున్నారని పేర్కొంది. కాబూల్‌లోని అధ్యక్ష భవనంలో హకానీ కుటుంబంతో జరిగిన సమావేశం సందర్భంగా వాగ్వివాదం చోటుచేసుకుందని, ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో బరాదర్ మరణించాడన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై తాలిబన్ నేతల మధ్య వివాదం చెలరేగిందని అంతర్జాతీయ మీడియా సంస్థ వరుసగా కథనాలు రాస్తున్నది.

