వాషింగ్టన్ : తాలిబన్లు సైనిక సంస్థలు కాదని, సామాన్య పౌరులేనని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. పాక్ సరిహద్దుల్లో 30 లక్షల మందికి పైగా ఆప్గాన్ శరణార్ధులు ఉన్నారని....వారిని ఎలా తుదముట్టించాలని కోరుతానని ప్రశ్నించారు. మంగళవారం రాత్రి పిబిసి న్యూస్ అవర్‌తో ఆయన మాట్లాడుతూ... ఈ విషయాన్ని వెల్లడించారు. వీరిలో ఎక్కువగా పష్టున్లు (తాలిబన్‌కు చెందిన ఓ జాతి) చెప్పారు. ఇప్పుడు అక్కడ 5 లక్షల మందితో కూడిన శిబిరాలు ఉన్నాయని, తాలిబన్లు సైనిక సంస్థలు కాదని, వారు సాధారణ పౌరులేనని పేర్కొన్నారు. ఈ శిబిరాల్లో కొంత మంది పౌరులు ఉంటే...పాకిస్తాన్ వారిని ఎలా తుదిముట్టిస్తుందని, వాటిని అభయారణ్యాలుగా ఎలా పిలుస్తారని ప్రశ్నించారు.

