కడప : కొండాపురం మండలం తాళ్ల పొద్దుటూరు గ్రామంలో ఫోటోగ్రాఫర్ల ఆధ్వర్యంలో కరోనా పై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని చేపట్టారు. కరోనా వ్యాప్తి రాకుండా అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు ఎలాంటి అపోహలకు భయబ్రాంతులకు గురికాకూడదని చెబుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగేంద్ర, సిఐ శ్రీరామ్ శ్రీనివాస్, ఏఎస్‌ఐ సుధాకర్, పోలీస్ సిబ్బంది, ఆశావర్కర్లు, ఫోటోగ్రాఫర్లు రాఘవరెడ్డి, నాగేంద్ర రెడ్డి, సుబ్రహ్మణ్యం వెంకటేష్ రెడ్డి, శివ, రమేష్ చంద్ర, శివారెడ్డి లు పాల్గొన్నారు.

