Dailyhunt
తాండవపల్లి గ్రామ సర్పంచ్ కి ఘన సన్మానం

తాండవపల్లి గ్రామ సర్పంచ్ కి ఘన సన్మానం

ప్రజాశక్తి-అమలాపురం రూరల్ : అమలాపురం మండలం తాండవపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం పదవీ కాలం పూర్తవుతున్న సందర్భంగా గురువారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ గంగుమళ్ళ ఏసుబాబు , ఉపసర్పంచ్ గుత్తాల సత్యనారాయణ, పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా గత 5 సంవత్సరాలుగా తాండవపల్లి గ్రామంలో జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది. గ్రామంలో రోడ్లు, కలవర్ట్, డ్రైన్స్ ముఖ్యంగా గ్రామంలో నీటి సమస్యను తీర్చేందుకు బోర్ ఏర్పాటు, రెండు వాటర్ ట్యాంకులు నిర్మాణం ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు రేవు శ్రీనుబాబు , మాజీ సర్పంచ్ పరమట శరత్ బాబు, మాజీ ఎంపీటీసీ కైరం సత్తిబాబు, టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు నంద్యాల దొరబాబు, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు రంకిరెడ్డి రామకృష్ణ, టిడిపి నాయకులు కైరం రాము, రంకిరెడ్డి శ్రీను, వైఎస్ఆర్ సీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు పరమట శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి, సచివాలయం సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti