Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తాతయ్య పరీక్ష

తాతయ్య పరీక్ష

రసింహపురంలో రాము ఐదవ తరగతి చదువుతున్నాడు._వారి ఇంటి పక్కనే ఒక తాతయ్య ఉండేవాడు._ఆయన అప్పుడప్పుడు పిల్లల్ని పిలిచి వారికి కొన్ని పరీక్షలు పెట్టేవాడు._ఒకసారి ఆయన రాముతో పాటు మరికొందరు పిల్లల్ని పిలిచి వారి తెలుగు పాఠ్య పుస్తకంలోని ఒక పేరాను చూపించాడు._తర్వాత దాన్ని చూస్తూ తప్పులు లేకుండా వ్రాయాలనీ, ఎవరు సరిగా వ్రాస్తే వారికి మంచి బహుమతి ఇస్తానని చెప్పాడు.

అప్పుడు రాముతో పాటు_పిల్లలందరూ పోటీలో పాల్గొన్నారు. పోటీ పూర్తయ్యాక రఘు విజేత అని_తాతయ్య ప్రకటించాడు._అది విన్న పిల్లలు 'తాతయ్యా!_ తనేం తప్పులు వ్రాయలేదా? అని అడిగారు._ అది విన్న తాతయ్య 'లేదురా!_తను తప్పులు వ్రాయలేదు. కావాలంటే_ ఒకసారి_ మీరే చూడండి` అన్నారు.
పిల్లలు తాము రాసింది పరీక్షించుకున్నారు. అందులో కొందరు కొన్ని_ వాక్యాలను అక్కడక్కడా_ తప్పిస్తూ రాశారు. ఇంకొందరు అందరికన్నా ముందుగా రాయాలి అన్న తపనతో వేగంగా రాస్తూ కొన్ని పదాలను వదిలేసి రాశారు._ ఇంకా కొందరు అక్షరాలను చూసి రాయకుండా పదాలను చూస్తూ రాయడం వల్ల కొన్ని అక్షరాలు మాయమయ్యాయి._ రఘు_ రాసిన దాన్ని కూడా పిల్లలు పరీక్షించారు. రఘు ప్రతి అక్షరాన్ని చూస్తూ_ జాగ్రత్తగా తొందరపడకుండా తప్పులు లేకుండా రాశాడు._అప్పుడు తాతయ్య 'చూశారా! పిల్లలూ, నేను తప్పులు లేకుండా రాయాలని అన్నాను కానీ_మీరు అలా చేయలేదు. అందరికన్నా త్వరగా రాసి పోటీలో నెగ్గాలని తప్పులు రాశారు. ఎప్పుడైనా సరే పరీక్షల్లో తొందరపడి తప్పులు రాయకూడదు. అలా చేస్తేనే పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి` అని తాతయ్య చెప్పగానే పిల్లలందరూ తమ తప్పు తెలుసుకున్నారు. ఇంకెప్పుడూ తొందరపడి తప్పులు రాయకూడదని తీర్మానించుకున్నారు.

- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య, ధర్మపురి
99085 54535​

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti