Dailyhunt
తగ్గేదెలే . ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మున్సిపల్ టీచర్ల వినూత్న ఆలోచన..!

తగ్గేదెలే . ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మున్సిపల్ టీచర్ల వినూత్న ఆలోచన..!

ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ స్కూళ్ళు కు దీటుగా పదవ తరగతి ఫలితాలు వెలువడ్డాయని ఉపాధ్యాయులు హర్షాన్ని వ్యక్తం చేశారు.

సోమవారం ఆదోనిలో తొలిసారిగా మున్సిపల్ హైస్కూల్ విద్యార్థుల ఫ్లెక్సీల ఏర్పాటు ​పదో తరగతి టాపర్ల ఫోటోలతో పట్టణంలో బ్యానర్లు దర్శనమిచ్చాయి. ​ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు చేసిన ఈ వినూత్న ఆలోచనపై ప్రజల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆదోని పట్టణ విద్యా రంగంలో ఒక వినూత్న మార్పు చోటుచేసుకుందని ఉపాధ్యాయులు అంటున్నారు. సాధారణంగా కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు మాత్రమే తమ విద్యార్థుల ఫలితాలను భారీ ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేసుకుంటాయి.

కానీ, అందుకు భిన్నంగా అదోనిలోని ఆర్.ఆర్. లేబర్ కాలనీ మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కె.రవి ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల చరిత్రలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ​పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన తమ పాఠశాల విద్యార్థుల ఫోటోలు, మార్కులతో కూడిన భారీ ఫ్లెక్సీలను పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేశారు. ఇలా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విజయాలను ప్రచార చిత్రాల ద్వారా పబ్లిక్ లో ప్రదర్శించడం అదోనిలో ఇదే మొట్టమొదటిసారి అని స్థానికులు చర్చించుకుంటున్నారు.

ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలల స్థాయిని పెంచేలా పట్టణంలోనే లేబర్ కాలనీ క్రాంతి నగర్ ప్రధాన రోడ్లలో లక్షల రూపాయలను ఏర్పాటు చేసి ప్రచారం కల్పిస్తున్నారు ఉపాధ్యాయులు. వారు తీసుకున్న ఈ నిర్ణయంపై పట్టణ ప్రజలు, విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. "ప్రతి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఇలాగే ఆలోచించి, ప్రభుత్వ పాఠశాలల్లోని నాణ్యమైన విద్యను ప్రజల్లోకి తీసుకెళ్తే.. పేద విద్యార్థులకు మరింత మేలు జరుగుతుందని, ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని" ప్రజలు ఉపాధ్యాయ బృందాన్ని అభినందిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti