* కమల్‌తో కలిసి పనిచేస్తానన్న రజనీకాంత్
చెన్నై: రానున్న ఎన్నికల్లో తమిళనాడులో కొత్త కూటమి ఏర్పడబోతోంది. సిని రంగంలో మంచి స్నేహితులైన కమల్ హాసన్, రజినీకాంత్‌లు రాజకీయ రంగంలోనూ కలిసి పని చేయాలని భావిస్తున్నారు. మొదట కమల్ హసన్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తన పార్టీ మక్కల్ నీది మయ్యం రజనీకాంత్‌తో కలిసి పని చేసేందుకు సిద్దంగా ఉందని అన్నారు. తామిద్దరం కూడా తమిళనాడు ప్రజల అభివృద్దినే కోరుకుంటున్నామని అన్నారు. కమల్ వ్యాఖ్యలపై స్పందించిన రజినీ కాంత్ తాను కూడా సిద్దంగా ఉన్నానని తెలిపారు. కమల్‌తో కలిసి పని చేయడం తనకెంతో ఇష్టమన్నారు. ''తమిళనాడు ప్రజల శ్రేయస్సు కోసం మేమిద్దరం కలవాల్సిన పరిస్థితే వస్తే కమల్‌తో కలిసి కచ్చితంగా పని చేస్తాను'' అని రజినీకాంత్ పేర్కొన్నారు.

