తాజా వార్తలు
తమ్ముడు పవన్ కోసం అన్నయ్య రంగంలోకి...!

విజయవాడ : గతంలో రాజకీయ పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్న మెగాస్టార్ చిరంజీవి.. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన సంగతి విదితమే. అయితే ఈ సారి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం మరోసారి రాజకీయాల్లో వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రత్యక్షంగా కాదని, పరోక్షంగానని సమాచారం. జనసేనకు చిరంజీవి మద్దతునిస్తున్నట్లు ఆపార్టీ నేత నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు చేయడం...ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో ఊపిరిపోసినట్లుయింది. పార్టీ కార్యకర్తల సమావేశంలో బుధవారం మాట్లాడిన ఆయన.. పవన్ రాజకీయ ప్రస్థానంలో ఆయన అన్నయ్య తోడుగా నిలవనున్నారని, పవన్ మళ్లీ సినిమాలు చేయడానికి కారణం చిరంజీవేనని అన్నారు. ఓ రెండేళ్లు సినిమాలు చేయాలని పవన్‌కు చిరంజీవి సూచించారని..
ఆయన సూచన మేరకే పవన్ సినిమాలు చేస్తున్నారన్నారు. రాజకీయ ప్రస్థానంలో తాను కచ్చితంగా ఉంటానని చిరంజీవి హామీ ఇచ్చారన్నారు.
ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో పార్టీ శ్రేణులు ఆనందం ఢోలికల్లో తేలిపోతున్నాయి. రాజకీయాల్లోకి చిరంజీవి మళ్లీ ప్రవేశించడం ఖాయమని జనసేన కార్యకర్తలు భావిస్తున్నారు. అంతేకాదు రానున్న తిరుపతి ఉపఎన్నికలో జనసేన నిలిస్తే... పార్టీకి చిరంజీవి మద్దతుగా నిలుస్తారన్న టాక్ వినపడుతోంది. గతంలో తిరుపతి నుంచి చిరంజీవి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు తమ్ముడు పవన్‌కి చిరంజీవి తోడుగా ఉంటారని.. జనసేన గెలుపుకు కఅషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
related stories
-
ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు విశాఖ పర్యటనకు పవన్
-
ముఖ్యాంశాలు రోహిణి ది గ్రేట్ అని మెచ్చుకుంటున్న నెటిజన్లు...?
-
రాజకీయాలు పవన్ కల్యాణ్‌పై టాలీవుడ్ నిర్మాత సంచలన ట్వీట్ !