ఏలూరు : టిడిపి నాయకులు, ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు రాంజీ ఆత్మహత్యయత్నం చేశారు. బుధవారం రాత్రి రాంజీ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయనను గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాంజీ ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. అయితే ఈ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

