చెన్నై : నేడు టివికె పార్టీ చీఫ్, ప్రముఖ నటుడు విజయ్ తిరుచి తూర్పు నియోజకవర్గం నుంచి ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీంతో తమ నేతని చూడటానికి ట్రిచీ విమానాశ్రయానికి వెలుపల భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు.
అక్కడ రోడ్లన్నీ జన సందోహంతో నిండిపోయాయి. అయితే ఆయన చేసే రోడ్ షోకు ఎలాంటి అధికారిక అనుమతులు లభించలేదు.

