చెన్నై : తమిళనాడులో టివికె పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. 108 స్థానాల్లో గెలిచినప్పటికీ మెజార్టీ మార్క్‌కు 10 సీట్లు తక్కువగా ఉన్నాయి.
దీంతో ఏదో ఒకపార్టీతో టివికె జతకట్టాలి. ఈ నేపథ్యంలో టివికెతో పొత్తుపెట్టుకోవడానికి కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ మేరకు సంకేతాన్ని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కె.సి వేణుగోపాల్ వెల్లడించారు. టివికెతో కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతుందని ఆయన మంగళవారం మీడియాకు లీకేజీలిచ్చారు.
కాగా, కె.సి వేణుగోపాల్ అలప్పుజాలో మీడియాతో మాట్లాడుతూ.. 'ఈ ఎన్నికల్లో డిఎంకెతో కలిసి మేం పోటీ చేశాం. కానీ ఇప్పుడు తమిళనాడులో కొత్త పరిస్తితి తలెత్తింది. ఈ సమయంలో కాంగ్రెస్ ఎన్నికల ఫలితాల అనంతరం తలెత్తిన పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది' అని ఆయన అన్నారు.

