ప్రజాశక్తి-చంద్రగిరి (తిరుపతి) : ట్రాక్టర్ ను భారీ కంటైనర్ ఢీకొట్టడంతో ఆరుగురికి గాయాలైన ఘటన బుధవారం తెల్లవారుజామున తిరుపతి జిల్లాలో జరిగింది.
తిరుపతి జిల్లా పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి చంద్రగిరి మండలం ముంగిలిపట్టు సమీపంలో దామల చెరువు నుంచి తిరుపతికి ఖాళీ మామిడికాయల బాక్స్ లతో వస్తున్న ట్రాక్టర్ ను బెంగళూరు నుంచి తిరుపతికి వస్తున్న భారీ కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో దామలచెరువుకు చెందిన గిరి, శోభ, గోపి, మంజు, డ్రైవర్ చంద్రశేఖర్ కు తీవ్ర గాయాలయ్యాయి. చంద్రగిరి 108 సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

