
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌కు సంబంధించిన గత ఎనిమిదేళ్ల ఆర్థిక లావాదేవీల రికార్డులు తమకు అందచేయాలంటూ అమెరికన్ కాంగ్రెస్ ఓవర్‌సైట్, రిఫార్మ్స్ కమిటీ చేసిన విజ్ఞప్తిపై అమెరికా సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. బుధవారం నుండి అమలులోకి రానున్న ఈ స్టే ఉత్తర్వుతో సభా సంఘం చేసిన విజ్ఞప్తిని అమలు చేయటం అసాధ్యమవుతుంది. తమ వినతిని న్యాయమూర్తులు పరిశీలించేందుకు వీలుగా దీనిపై తాత్కాలిక స్టే విధించటాన్ని తాము అంగీకరిస్తున్నట్లు సభా సంఘం సోమవారం నాడు ఒక లేఖలో సుప్రీంకోర్టుకు తెలియచేసింది. సభా సంఘం చేసిన విజ్ఞప్తిని పెండింగ్‌లో వుంచాలని కోరుతూ ట్రంప్ తరపు న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టులో గత శుక్రవారం పిటిషన్ దాఖలుచేసిన విషయం తెలిసిందే.