తమిళనాడు : నేడు సినీనటి త్రిష పుట్టినరోజును పురస్కరించుకొని …. ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ 'విశ్వంభర' చిత్ర బృందం తాజాగా పోస్టర్ ను రిలీజ్ చేసింది.
వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతోన్న చిత్రం 'విశ్వంభర'. ఇందులో చిరుకు జోడీగా త్రిష, అషికా రంగనాథ్ నటిస్తున్నారు. అందులో త్రిష అవని పాత్రలో కనిపించనున్నట్లు దర్శకుడు తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ …. 'మీరు 'విశ్వంభర'లో నటించడం వల్ల ఇది మరింత ప్రత్యేకంగా మారింది' అని పేర్కొన్నారు. మెగా మాస్ సినిమా కోసం వేచి ఉండాలని కోరారు. సూర్య హీరోగా ఆర్జే బాలాజీ తెరకెక్కిస్తోన్న సినిమా 'కరుప్పు'. తెలుగులో 'వీరభద్రుడు'. ఇందులో త్రిష లుక్‌ను కూడా తాజాగా విడుదల చేశారు. ఆమె ప్రీతి పాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ వీడియో పంచుకున్నారు. ఈ చిత్రం మే 14న విడుదల కానుంది.

