Thursday, 12 Apr, 4.39 am

తాజావార్తలు
త్వరలో పర్యావరణ వాహనాలు

- కాలుష్య రహితంగా రాజధాని నిర్మాణం
- ఆనంద నగరాల సదస్సులో సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి-గుంటూరు సిటీ ప్రతినిధి:
రాజధాని అమరావతికి పర్యావరణ కాలుష్య రహిత ద్విచక్ర వాహనాలను (ఎలక్ట్రిక్‌ బైక్‌లు) త్వరలో తీసుకువస్తామని సిఎం చంద్రబాబు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి సికె కన్వెన్షన్‌ హాల్‌లో రెండ్రోజులుగా నిర్వహిస్తున్న ఆనందనగరాల సదస్సులో ఆయన మాట్లా డారు. ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను సిఎం సందర్శించారు. అవేరా సంస్థ అమరావతిలో ఉత్పత్తి చేస్తున్న సౌరశక్తి బ్యాటరీతో నడిచే అవేరా బైకులు, అవి పనిచేసే విధానాన్ని తెలుసుకున్నారు. అనంతరం సిఎం మాట్లాడుతూ బ్యాటరీ ఆధారంగా నడిచే స్కూటర్లు ఎంతో సౌలభ్యంగా ఉంటాయని, విద్యుత్‌తో నడిచే వాహనాలతో చాలావరకు కాలుష్యాన్ని నియంత్రించొచ్చని చెప్పారు. త్వరలోనే అమరావతి నగరంలో ప్రజలను బ్యాటరీ వాహనాలు కనువిందు చేయనున్నాయన్నారు.
ఇదిలా ఉండగా బృంద చర్చల సందర్భంలో ప్రాంగణం వద్దకు వచ్చిన సిఎం మరోహాల్‌లో కొందరు ప్రతినిధులు, అధికారులతో సమావేశమయ్యారు. హాజరు తక్కువగా ఉండటంతో అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు సదస్సులో మూడు బృంద చర్చల్లో వివిధ దేశాలకు చెందిన సంస్థల ప్రతినిధులు తమ దేశంలోని పరిస్థితులను వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అమలు చేస్తున్న విధానాలను వివరించారు. ఆనంద నగరానికి కొలమానం అంటే ఏమిటి? దాన్ని ఎలా సాధించాలి? అనే అంశాలపై, సంతోషకర జీవన విధానం, అందరితో కలిసి జీవించటం అనే అంశంపై, క్టీన్‌, బ్లూ అండ్‌ గ్రీన్‌- నగరాల సుస్థిరాభిóవృద్ధి అనే అంశాలపైన చర్చించారు. చర్చల్లో పాల్గొన్న వారిని మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ సత్కరించారు. చర్చల అనంతరం పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా ఆనందనగరాలను కాలుష్య రహితంగా, పర్యావరణ సహితంగా ఎలా నిర్మించాలి? వ్యర్థాలను ఉపయోగించి గ్యాస్‌, విద్యుత్‌ను ఎలా ఉత్పత్తి చేయాలి? అనే అంశాలను వివరించారు. తెనాలి మున్సిపల్‌ కమిషనర్‌ కె.శకుంతల, రాజమండ్రి మున్సిపల్‌ కమిషనర్‌ విజరురామరాజు మాట్లాడుతూ తమ ప్రాంతాల్లో స్వచ్ఛతకు తీసుకుంటున్న చర్యలను, అవలంబిస్తున్న పద్ధతులను వివరించారు. చర్చల్లో జూలి రస్క్‌ (యుఎస్‌ఎ), షోకిజాగ్మా (భూటాన)్‌, జేన్‌ వైస్‌మెన్‌ (యుఎస్‌ఎ), నీలేష్‌ రాజాధ్యక్ష (యుకె), ఉమాంగ్‌ ప్రభాకర్‌ (డాల్‌బెర్గ్‌) పాల్గొన్నారు.

Dailyhunt
Top