Dailyhunt
ఉబర్ కప్ విజేత కొరియా

ఉబర్ కప్ విజేత కొరియా

  • థామస్ కప్ లో భారత్ కు కాంస్యం

కోపెన్ హాగన్(డెన్మార్క్): మహిళల ఉబర్ కప్ టైటిల్ ను కొరియా జట్టు గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో కొరియా జట్టు 3-1తో పటిష్ట చైనాను చిత్తుచేసింది.

తొలి సింగిల్స్ లో అన్-వై-యంగ్(కొరియా) 21-10, 21-13తో వాంగ్ జూ(చైనా)ను ఓడించింది. దీంతో కొరియా 1-0 ఆధిక్యతలో నిలిచింది. ఆ తర్వాత జరిగిన డబుల్స్ లో చైనా షట్లర్లు రాణించారు. లూస్-టాన్ 21-15, 21-12తో కొరియా ధ్వయాన్ని ఓడించారు. దీంతో స్కోర్ 1-1తో సమమైంది. మరో సింగిల్స్ లో కిమ్-జీ(కొరియా) 21-19, 21-15తో టాప్ సీడ్ చెన్ యూఫీ(చైనా)కు ఝలక్ ఇచ్చింది. దీంతో కొరియా 2-1 ఆధిక్యతలో నిలిచింది. ఆ తర్వాత జరిగిన డబుల్స్ లో కొరియా షట్లర్లు పుంజుకొని మూడుసెట్ల పోరులో విజయం సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్ లో కొరియా జంట 16-21తో తొలి సెట్ ను చేజార్చుకున్నా.. ఆ తర్వాత రెండు గేమ్ లను 21-10, 21-13తో ముగించారు. దీంతో కొరియా 3-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టైటిల్ ను కైవసం చేసుకుంది. చైనాకు రజత పతకం, ఇండోనేషియా, జపాన్ జట్లకు కాంస్య పతకాలు దక్కాయి.

థామస్ కప్ లో భారత పురుషుల జట్టుకు కాంస్యం

ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్‌ థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిపాలైంది. ఫ్రాన్స్‌తో శనివారం రాత్రి జరిగిన పోటీలో భారత్ 0-3తో ఓటమిపాలైంది. తొలి సింగిల్స్‌ ఆయుశ్‌ శెట్టి 11-21, 9-21తో క్రిస్టో పొపోవ్‌ చేతిలో_39 నిమిషాల్లోనే ఓడాడు._ రెండో సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ 16-21, 18-21తో అలెక్స్‌ లేనియర్‌ చేతిలో, మూడో సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 21-19, 21-16తో టోమా జూనియర్‌ పొపోవ్‌తో 48 నిమిషాల్లో _ఓడాడు. సెమీస్‌లో ఓటమితో భారత్‌ కాంస్య పతకంతో సంతృప్తి చెందింది. మోచేతి గాయం కారణంగా లక్ష్య సేన్‌ సెమీస్ బరిలో ఆడలేదు. థామస్ కప్ ఫైనల్లో చైనా-ఫ్రాన్స్ జట్లు తలపడనున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti