Dailyhunt
ఉదయం తొమ్మిది నుంచే బ్యాంకులు

ఉదయం తొమ్మిది నుంచే బ్యాంకులు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి
పాక్షిక లాక్‌డౌన్‌ నేపథ్యంలో బ్యాంకులు కూడా తమ పనివేళ్లలో మార్పులు చేసుకుంటున్నాయి. గురువారం నుంచి కొత్త వేళలు అమలులోకి వస్తాయి. ఉదయం తొమ్మిది గంటలకే బ్యాంకు లావాదేవీలు ప్రారంభమై మధ్యాహ్నం ఒరటి గంట వరకు కొనసాగుతాయి. కరోనా కారణంగా కొద్ది రోజులుగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేసిన బ్యాంకులు నేటి నుంచి ఒక గంట ముందుగానే తెరుచుకోనున్నాయి. కరోనా ఉధృతి కారణంగా గురువారం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వ్యాపార లావాదేవీలకు అనుమతి ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటిoచిoది. ఆ తరువాత అన్నీ మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగానే బ్యాంకులు కూడా త్వరగా తెరిచి ఒంటి గంటకు లావాదేవీలు పూర్తి చేయాలని నిర్ణయించాయి.

ఈ మేరకు అన్ని శాఖలకు సూచనలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti