Dailyhunt
ఉద్దండరాయునిపాలెంలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ

ఉద్దండరాయునిపాలెంలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ

ప్రజాశక్తి - తుళ్లూరు : ఉద్దండ రాయునిపాలెంలో రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రదేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం మధ్యాహ్నం 2 గం.లకు రానున్నారు.

ఈనేపధ్యంలో ఏర్పాట్లను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అమరావతికి చట్టబద్ధత లభించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. రాజధాని రైతుల పోరాటం నేడు ఫలించిందని అన్నారు. 11 సీట్లకు పరిమితమైనా జగన్ మోహన్ రెడ్డిలో మార్పు రాలేదన్నారు.

ఇప్పటికీ అమరావతి పేరు పలకటానికి ఇష్టపడట్లేదని మంత్రి అన్నారు. జగన్ 'మావిగన్' అంటే చిన్నపిల్లలు సైతం నవ్వుకుంటున్నారని, కేంద్రం చేసే చట్టాలు రాష్ట్రాలు పాటించాల్సిందేనన్నారు. కొత్తగా వచ్చిన వారు రాజధానిని మారుస్తామంటే కుదరదు. ఇక అమరావతిని కదిలించడం ఎవరివల్లా కాదని అన్నారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ సిఎం. సాయికాంత్ వర్మ, ఎస్ పి వకుల్ జిందాల్,ఇతర అధికారులు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti