Friday, 18 Oct, 11.12 am ప్రజాశక్తి

పశ్చిమ గోదావరి
ఉగాదినాటికి అర్హులందరికీ ఇళ్ల స్థలాలు

ప్రతిపాదనలు సిద్ధం
ఏలూరు డివిజన్‌లో ఉంగుటూరు ముందజ
తహశీల్దారు జాన్‌రాజు
ప్రజాశక్తి - ఉంగుటూరు
ముఖ్యమంత్రి జగన్‌ నవరత్నాల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా అర్హత కలిగిన ప్రతి పేదవానికి ఇంటి స్థలం, అందులో గృహనిర్మాణానికి రుణాలు అందించే దిశగా శరవేగంతో ప్రతిపాదనలు జిల్లా ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడూ పంపిస్తున్నామని ఉంగుటూరు తహశీల్దారు ఇ.జాన్‌రాజు అన్నారు. ఇళ్ల స్థలాలు, ఇంటి రుణాల అర్హుల జాబితాలపై అభ్యంతరాల గ్రామసభల్లో భాగంగా శుక్రవారం నారాయణపురం పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఈ మండలంలో 9744 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో క్షేత్రస్థాయిలో విచారణ చేయగా ఇళ్ల స్థలాల కోసం 2711, సొంత స్థలం ఉండి రుణాల కోసం 2677 మంది అర్హులుగా గుర్తించామన్నారు. వీరందరికి మండలంలో 67.78 ఎకరాల భూమి అవసరం ఉంటుందని నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించామని చెప్పారు. ప్రతిపాదనలు సత్వరం జిల్లా యంత్రాంగానికి అందిజేయడంలో ఏలూరు డివిజన్‌లో ఉంగుటూరు మండలం ప్రథమ స్థానంలో ఉందన్నారు. ప్రభుత్వ భూమి 32 ఎకరాల నివాస యోగ్యంగా ఉన్నట్లు గుర్తించామని, మిగతా 35.78 ఎకరాల భూమిని భూసేకరణ చేయాల్సి ఉందని తెలిపారు. అర్హత ఉండి పొరపాటున జాబితాల్లో పేర్లు లేనివారు ఆందోళన చెందవద్దని, తిరిగి దరఖాస్తులను స్వీకరించి ఆన్‌లైన్‌ చేస్తామని చెప్పారు.

రెండు రోజుల పాటు మండలంలో నిర్వహించిన గ్రామ సభల్లో 347 అభ్యంతరాలు వచ్చాయన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు మరడ వెంకట మంగారావు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేపట్టిలేని విధంగా పేదలకు ఇళ్ల స్థలాలు, రుణాలు వైసిపి ప్రభుత్వం ఇవ్వనుందని చెప్పారు. నారాయణపురంలో 232 మందికి పైగా కచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చితీరుతామన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా కార్యదర్శి బండారు నాగరాజు, పార్టీ గ్రామ అధ్యక్షుడు పైడి అరుణ్‌కుమార్‌, నాయకులు ప్రసాద్‌, పంచాయతీ కార్యదర్శి రవిచంద్రకుమార్‌, విఆర్‌ఒ పుల్లయ్య, వాలంటీర్లు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top
// // // // $find_pos = strpos(SERVER_PROTOCOL, "https"); $comUrlSeg = ($find_pos !== false ? "s" : ""); ?>