న్యూఢిల్లీ : జెఎన్ యు మాజీ అధ్యక్షుడు ఉమర్ ఖలీద్ మధ్యంతర బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. పిటిషన్ ను విచారించిన అదనపు సెషన్స్ జడ్జి సమీర్ బజ్ పాల్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు.
తన మామగారి వర్ధంతి (చెహ్లుమ్)కి హాజరయ్యేందుకు, శస్త్రచికిత్స చేయించుకోవలసి ఉన్న తన తల్లిని చూసుకోవాల్సి వున్నందున 15 రోజుల మధ్యంతర బెయిల్ కోరుతూ ఉమర్ ఖలీద్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రధాన సూత్రధారులుగా ఆరోపిస్తూ ఉమర్ ఖలీద్ సహా పలువురిపై యుఎపిఎ చట్టం, ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

