Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vaibhav - యువకుడి ఆటకు దేశమంతా ఫిదా - బిగ్ బి ప్రశంసలు..!

Vaibhav - యువకుడి ఆటకు దేశమంతా ఫిదా - బిగ్ బి ప్రశంసలు..!

Ipl 2026 - ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అందరి దృష్టిని ఆకర్శించాడు. తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాడు.

రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన ఈ సెన్సేషనల్ బ్యాట్స్‌మెన్.. సీనియర్ బౌలర్లను సైతం బెంబేలెత్తిస్తూ రికార్డుల మీద రికార్డులు సృష్టించాడు.

వైభవ్ సంచలన ఆటతీరు చూసి యావత్ దేశం ఆశ్చర్యపోతోంది. క్రికెట్ దిగ్గజాల నుండి బాలీవుడ్ సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఈ యువ సంచలనాన్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో …. బాలీవుడ్ లెజెండ్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా వైభవ్ ఆటపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'నాకు 15 ఏళ్ల వయసున్నప్పుడు, స్కూల్లో కనీసం గోల్ కీపర్‌గా కూడా సరిగ్గా ఆడటం చేతకాని పరిస్థితి. గోళిలు, గల్లీ క్రికెట్ కూడా సరిగా ఆడలేకపోయేవాళ్లం. కానీ ఈ చిన్న వయసులోనే నువ్వు అద్భుతాలు సృష్టిస్తున్నావ్. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన లీగ్‌లో ఇంత అద్భుతంగా ఆడుతున్నావ్.' అంటూ ఆశీస్సులు అందించారు అమితాబ్ బచ్చన్. కేవలం అమితాబ్ మాత్రమే కాదు, 'గాడ్ ఆఫ్ క్రికెట్' సచిన్ టెండూల్కర్ సైతం వైభవ్ క్లాసిక్ బ్యాటింగ్ శైలిని, అతనికున్న టైమింగ్‌ను ఎక్స్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు వైభవ్ కీలక ప్లేయర్‌గా మారాడు. ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఆటతీరుతో యావత్ దేశం ఫిదా అయిపోయింది.

ఈ ఏడాది ఐపిఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన 15 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ గణాంకాలు ఆశ్చర్యపరుస్తున్నాయి.

మొత్తం మ్యాచ్‌లు: 16
మొత్తం పరుగులు: 776
బ్యాటింగ్ సగటు: 48.50
స్ట్రైక్ రేటు: 237.31
హాఫ్ సెంచరీలు: 5
సెంచరీ: 1
మొత్తం సిక్సర్లు: 72 (ఒకే ఐపిఎల్ సీజన్‌లో ఒక బ్యాట్స్‌మెన్ కొట్టిన అత్యధిక సిక్సర్లు)
గరిష్ట స్కోరు: 103
మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించడం, ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 30 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోవడం.. రాజస్థాన్ అద్భుత ప్రదర్శన చేసింది. ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి, క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్ విధ్వంసకర బ్యాటింగ్‌కు (214 పరుగులు) గట్టి పోటీ ఇచ్చి టోర్నమెంట్‌లో మూడో స్థానంలో నిలిచింది. రాజస్థాన్ జట్టు ఈ స్థాయికి చేరడం వెనుక వైభవ్ పోరాటం దాగుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti