Dailyhunt
వనస్థలిపురం డీ మార్ట్‌లో దారుణం

వనస్థలిపురం డీ మార్ట్‌లో దారుణం

హైదరాబాద్‌: నగరంలోని వనస్థలిపురంలో డీ మార్ట్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. గడిచిన రాత్రి శ్రీచైతన్య కళాశాలకు చెందిన ఇంటర్‌ విద్యార్థి సతీష్‌ డీ మార్ట్‌ వద్ద అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. సెక్యూరిటీ సిబ్బంది కొట్టిన దెబ్బల వల్లే తమ కొడుకు సతీశ్‌ చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి షాపింగ్‌కు సతీష్‌ డీ మార్ట్‌కు వెళ్లాడు. కాగా చాక్లెట్‌ దొంగిలించాడని డీ మార్ట్‌ సిబ్బంది విద్యార్థిని పట్టుకున్నట్లుగా సమాచారం. అనంతరం అనుమానాస్పద స్థితిలో సతీష్‌ చనిపోయాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti