పశ్చిమ గోదావరి
వణికిస్తున్న చలి..!

ప్రజాశక్తి - జీలుగుమిల్లి, బుట్టాయగూడెం
పశ్చిమ ఏజెన్సీలో ఉష్ణోగ్రత బాగా తగ్గిపోవడంతో గిరిజన గ్రామాల్లో చలికి తట్టుకోలేక జనం విలవిల్లాడుతున్నారు. దీంతో జనం చలి మంటల వైపు పరుగులు తీస్తున్నారు. దీంతో జీడిమామిడి, మామిడిపూత మొత్తం మాడిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదేవిధంగా మంచు తీవ్రత ఉంటే పెట్టిన పెట్టుబడులు కూడా రావడం కష్టమేనని రైతులు లబోదిబోమంటున్నారు. గిరిజన ప్రాంతంలో కొద్దిరోజులుగా పొగమంచు కమ్మేస్తోంది. ఉదయం తొమ్మిది గంటల వరకు మంచు నిలిచిపోవడంతో అటు వ్యవసాయ పనులు సాగించే వారితో రహదారిపై ప్రయాణించే వారి ఇబ్బందులు తప్పడం లేదు. దర్భగూడెం వద్ద జాతీయ రహదారిపై మంచు కమ్మేయడంతో చూడటానికి ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ గోతులు కనిపించకపోవడంతోపాటు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహన డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.