Tuesday, 22 Oct, 12.26 am ప్రజాశక్తి

తాజావార్తలు
వసతిగృహ విద్యార్థిని ఆత్మహత్య

ప్రజాశక్తి - హిరమండలం:
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం ఎపి మోడల్‌ హైస్కూల్‌ విద్యార్థి గుంట పూర్ణ (14) సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి. టెక్కలి మండలం మెట్టపేటకు చెందిన యోగీశ్వరరావు, అరుణ దంపతుల కుమార్తె పూర్ణ పాతపట్నం మోడల్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుంది. రోజూ మాదిరి పాఠశాలకు వెళ్లి సాయంత్రం వసతి గృహానికి చేరుకుని తలుపులు వేసుకుంది. కొద్దిసేపటికి స్నేహితులు వసతి గృహానికి వెళ్లగా తలుపులు వేసి ఉన్నాయి. ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడంతో తోటి విద్యార్థులకు ఉపాధ్యాయులకు సమాచారమిచ్చారు. ఉపాధ్యాయులు వెళ్లి తలుపులు పగలుగొట్టి లోపలకు వెళ్లి పరిశీలించగా... చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే పోలీసులకు, విద్యాశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు పాతపట్నం ఎస్‌ఐ టి.రాజేష్‌ వసతిగృహానికి చేరుకుని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మృతురాలు గత కొంత కాలం నుంచి వసతి గృహంలో ఉండనంటూ మారాం చేసిందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. రెండు నెలల నుంచి వసతి గృహంలో ఉంటుందని, అంతకుముందు టెక్కలి నుంచి పాఠశాలకు బస్సులో వచ్చేదని తెలిపారు. సమాచారం అందుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ, పాతపట్నం తహశీల్దారు ఎం.కాళీప్రసాద్‌ వచ్చి పరిశీలించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top