శోభిత ధూళిపాళ నటిస్తున్న తాజా చిత్రం 'వెట్టువం'. ఈ సినిమా విశేషాలను తాజాగా ఆమె పంచుకున్నారు. 'ఈ సినిమా సాధారణ ప్రాజెక్ట్ కాదు.
ప్రేక్షకులను పూర్తిగా తన ప్రపంచంలోకి లాక్కెళ్లే అరుదైన అనుభవంగా నిలుస్తుంది. సైన్స్ ఫిక్షన్ జానర్ అంటే నాకు వ్యక్తిగతంగా ఎంతో ఇష్టం. అయితే, 'వెట్టువం' పూర్తిగా సైన్స్ ఫిక్షన్ కంటే ప్రళయానంతర ప్రపంచాన్ని కేంద్రంగా చేసుకుని సాగుతుంది. ఒక విపత్తు తర్వాత ప్రపంచం ఎలా మారుతుంది, ఆ పరిస్థితుల్లో మనుషుల జీవితాలు ఎలా ఉంటాయనే అంశాలతో ఈ సినిమా సాగుతుంది' అని ఆమె వెల్లడించారు.
పా. రంజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో శోభిత కీలక పాత్ర పోషిస్తున్నారు. 'నీలం ప్రొడక్షన్స్' బ్యానర్‌పై పా. రంజిత్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఆగస్టు తర్వాత విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

