Dailyhunt
విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లు అందజేత

విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లు అందజేత

ప్రజాశక్తి-కాకినాడ : సోమవారం కాకినాడ కలెక్టరేట్ లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులకు రూ.6.15 లక్షల విలువైన ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లను జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్ విభిన్న ప్రతిభావంతులు వయావృద్ధుల సంక్షేమ శాఖ ఏడి ఏవై.శ్రీనివాసుతో కలిసి ఉచితంగా అందించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్ మాట్లాడుతూ …. జిల్లా విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డిగ్రీ, ఆపైన చదువుతున్న దివ్యాంగులకు, రూ.45 వేల విలువైన ల్యాప్ టాప్, పదో తరగతి ఆ పైన చదువుతున్న బధిరులకు రూ.15 వేల విలువైన మొబైల్ ఫోన్లు ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. సోమవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని 11 మందికి ల్యాప్ టాపులు, 8 మందికి మొబైల్ ఫోన్లు పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం, అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూ.6.15 లక్షల విలువైన ల్యాప్ టాపులు, మొబైల్ ఫోన్లు ఉచితంగా విద్యార్థులకు అందించిందన్నారు. దివ్యాంగ విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డా.టి.తిప్పేనాయక్, విభిన్న ప్రతిభావంతులు వయావృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయ సూపరింటెండెంట్ ఉండ్రాజుపు రాజు, వివిధ శాఖల అధికారులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti