తూర్పు గోదావరి : యువతీ యువకులిద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శుక్రవారం రాజమండ్రి ఎవి అప్పారావు రోడ్డులోని నిర్మానుష్య ప్రదేశంలో వెలుగు చూసింది. స్థానిక సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

