Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
22 నాటి మ్యాచ్ కోసం నకిలీ యాప్‌లు

22 నాటి మ్యాచ్ కోసం నకిలీ యాప్‌లు

- జాగ్రత్తగా ఉండాలని సీపీ సజ్జనార్ హెచ్చరిక

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16: ఉప్పల్ వేదికగా ఈనెల 22న జరగనున్న ఎసఆర్‌హెచ్, ఆర్సీబీ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌ను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మలచుకుంటున్నట్లు సీపీ సజ్జనార్ హెచ్చరించారు.

'సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ టికెట్ల బుకింగ్‌కు సంబంధించి అనేక ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. అధికారిక టికెటింగ్ భాగస్వామి అయిన 'డిస్ట్రిక్ట' యాప్‌ను పోలిన రంగులు, లోగోలతో ఉన్న నకిలీ యాప్‌లను సృష్టించి తక్కువ ధరకే టికెట్లు ఇస్తామంటూ ఊరిస్తున్నారు. ఫేక్ యాప్స్‌తో తస్మాత్ జాగ్రత్త. మ్యాచ్ చూడాలనే ఉత్సాహంతో సోషల్ మీడియాలో వచ్చే అనధికార లింకులను నమ్మి మోసపోవద్దు.. ఇలాంటి ఫేక్ యాప్స్, వెబ్‌సైట్లపై నిఘా ఉంచాం.. ఎవరికైనా ఇలాంటి యాప్స్, వెబ్‌సైట్ల గురించి తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి' అని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్‌'లో పోస్టు చేశారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News