Thursday, 29 Jul, 8.47 am ప్రజాతంత్ర

ఆంధ్రప్రదేశ్
ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ

అమరావతి, జూలై 28 : కరోనా చికిత్స చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, డి-టైపు సిలిండర్లు, ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. వీటి నిర్వహణ కోసం నిపుణులను నియమించటంతో పాటు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్‌ పక్రియలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్‌ బుధవారం సక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. గ్రాణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఆస్పత్రుల నిర్వహణలో కీలకమైన ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణ, ఎలక్టిక్రల్‌, ఎసి మరమ్మతులు, ఇతర వైద్య పరికరాల అనుబంధ విభాగాలను ఎప్పటికప్పుడు సక్షిస్తుండాలని అన్నారు. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు.

వంద పడకలు కలిగిన ప్రైవేటు ఆస్పత్రులు మొదటి ప్రాధాన్యంగా ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని, ఇందుకోసం 30 శాతం వరకు రాయితీ కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే కొత్త వైద్య కళాశాలల కోసం భూ సేకరణను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్‌ పక్రియలో ఉపాధ్యాయులకు ప్రాధాన్యత కల్పించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్‌ కేటాయింపులు, తక్కువ వినియోగంపై మరోమారు కేంద్రానికి లేఖ రాయనున్నట్లు సిఎం జగన్‌ తెలిపారు. ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కరోనా వైరస్‌ నివారణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. థర్డ్ వేవ్‌ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై సక్షించారు. వ్యాక్సినేషన్‌లో టీచర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. వీలైనంత త్వరగా టీచర్లకు వ్యాక్సినేషన్‌ను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. మే, జూన్‌, జులై నెలల్లో ప్రైవేట్‌ ఆస్పత్రులకు 43.38 లక్షల డోసులు ఇస్తే.. కేవలం 5,24,347 డోసులు మాత్రమే వాడారని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ వ్యాక్సిన్లను ప్రభుత్వానికి ఇస్తే వ్యాక్సినేషన్‌ను వేగంగా ముందుకు సాగుతుందని, దీనిపై మరోసారి కేంద్రానికి లేఖ రాస్తానని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. వివిధ రాష్ట్రాల్లో సుల సంఖ్య, వ్యాక్సినేషన్‌, వ్యాక్సినేషన్‌ అనంతరం అక్కడి కోవిడ్‌ తీరు తదితర అంశాలపై అధ్యయనం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఇందుకోసం ఒక కమిటీని నియమించాలన్నారు. 'ఈ అంశాలపై కమిటీ అధ్యయనం అనంతరం నివేదిక సమర్పించాలి. తద్వారా కోవిడ్‌ నివారణకు అవసరమైతే రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాల్లో మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుంది' అని పేర్కొన్నారు. నూతన మెడికల్‌ కళాశాలల కోసం పెండింగ్‌ ఉన్న చోట భూసేకరణను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కొత్త మెడికల్‌ కాలేజీల్లో పనుల ప్రగతిపై వచ్చే సమావేశంలోగా తనకు నివేదిక ఇవ్వాలన్నారు.

సక్షా సమావేశంలో. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), డీజీపీ గౌతం సవాంగ్‌, స్టేట్‌ కోవిడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్‌ ఎం టీ కృష్టబాబు, ఇంటెలిజెన్స్ చీఫ్‌ కే వి రాజేంద్రనాథ్‌ రెడ్డి, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Prajatantra News
Top