Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్థిక తుఫాన్ రాబోతోంది

ఆర్థిక తుఫాన్ రాబోతోంది

- ప్రధాని విదేశీ పర్యటనలు ఆపాలి- వారం రోజుల్లోనే రెండోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- కేంద్రంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

న్యూదిల్లీ, మే 20 దేశంలో వరుసగా పెరు గుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై లోక్సభప్రతి పక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విమ ర్శలు గుప్పించారు.

దేశంలోకి ఒక పెద్ద "ఆర్థిక తు ఫాన్" రాబోతోందని, రాబో యే రోజులు సామాన్యుడికి అత్యంత కఠినంగా మారనున్నా యని ఆయన హెచ్చరించారు. తన సొంత నియోజకవ ర్గమైన రాయ్బరేలీలో మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రమాదంలో పడిందనే ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సంక్షోభ సమయంలో తగిన చర్యలు తీసుకోకుండా ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు చేయడం సరి కాదని హితవు పలికారు. 'మోదీజీ ఆర్థిక వ్యవస్థను మార్చేశారని నేను కొన్ని రోజులుగా చెబుతున్నాను.. ఒక ఆర్థిక తుఫాను రాబోతోంది. వారి అదానీ-అంబానీ వ్యవస్థ ఎక్కువ కాలం నిలవదు.. అది కూలిపోతుంది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, సామా న్యుడు నష్టపోతాడు" అని రాహుల్ గాంధీ అన్నారు. ఈ ఆర్థిక తుఫాను.. అదానీ, అంబానీ, మోదీ లపై ప్ర భావం చూపదన్నారు. ఇది సామాన్యుడిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని చెప్పుకొచ్చారు. ఇది చాలా తీవ్రతతో ఉంటుంది. కఠినమైన రోజులు రాబోతున్నాయి. చర్య లు తీసుకోవడానికి బదులుగా నరేంద్ర మోదీ స్వయంగా విదేశీ పర్యటనలకు వెళ్లి, ప్రజల ను విదేశీ పర్యటనలు చేయవద్దని కోరుతున్నారు" అని రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు చాలా కాలం తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపును చేపట్టారు. ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు రూ.3 చొప్పున పెంచిన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు… మంగళవారం ఉదయం పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు సుమారు 90 పైసలు పెంపు చేపట్టాయి. అయితే వారం లోపే ఇంధన ధరలు పెరగడం ఇది రెండవసారి. మంగళవారం ఉదయం పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు సుమారు 90 పైసలు పెరిగాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై యుద్ధం ప్రారంభించిన తర్వాత మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి దిగ్బంధంతో చాలా దేశాలు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నాయి. హర్మూజ్ జలసంధిని వాణిజ్య రవాణాకు మూసివేయడం వల్ల ప్రపంచ ఎగుమతులకు అంతరాయం ఏర్పడింది. దీంతో చాలా దేశాలు సంక్షోభపరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.
అయితే భారత్లో ఆ స్థాయిలో కొరత లేకపోయినప్పటికీ ప్రధాని మోదీ ఈనెల 10న హైదరాబాద్ పర్యటన సందర్భంగా పలు పొదుపు చర్యలకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరల పెంపు చోటుచేసుకుంది. మరోవైపు 15వ తేదీన సీఎన్ జీ ధరలను కిలోకు రూ.2 మేర పెంచారు. ఆ తర్వాత రెండు రోజులకే మరోసారి రూ.1 మేర పెంచారు. ఇంధన ధరల పెంపుపై కేంద్రంలోని మోదీ సర్కార్పై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News