బిజెపి, కాంగ్రెస్ పార్టీలపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు నిప్పులు చెరిగారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు.ఇప్పుడు అధికారంలో ఉన్న బిజెపి నేతలెన్నడూ కూడా అభివృద్ధి చేసిన పాపాన పోలేదన్నారు. సిద్ధిపేట అభివృద్ధిని ఓర్వలేని నేతలు సిద్ధిపేటకు వచ్చి వోట్లు ఎలా అడుగుతారనీ మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. సిద్ధిపేటకు చెందిన ప్రశాంత్‌నగర్ మాజీ సర్పంచి, టిడిపి రాష్ట్ర నాయకుడు ఎల్లు రవీందర్‌రెడ్డి సుమారు 100మంది అనుచరులతో గురువారం మంత్రి హరీష్‌రావు సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. టిఆర్‌ఎస్‌లో చేరిన రవీందర్‌రెడ్డికి మంత్రి హరీష్‌రావు గులాబీ కండువాను కప్పి టిఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్‌లో కౌన్సిలర్‌గా నామినేషన్ వేసి.టిఆర్‌ఎస్‌లోకి.
కాంగ్రెస్‌కు షాకిచ్చిన వహీద్‌ఖాన్.
సిద్ధిపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీ మైనారిటీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వహీద్‌ఖాన్ ఆ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చాడు. వహీద్‌ఖాన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గురువారం సిద్ధిపేటలో మంత్రి హరీష్‌రావు సమక్షంలో గులాబీ కండువాను కప్పుకున్నారు. టిఆర్‌ఎస్‌లో చేరిన వహీద్‌ఖాన్‌కు మంత్రి హరీష్‌రావు గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వహీద్‌ఖాన్ మాట్లాడుతూ.25యేండ్లుగా కాంగ్రెస్ పార్టీలో పని చేశాననీ, కన్నతల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ కంటే సిద్ధిపేటలో మంత్రి హరీష్‌రావు చేస్తున్న అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేందుకు మాత్రమే టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తాజామాజీ మునిసిపల్ ఛైర్మన్ కడవేర్గు రాజనర్సు, సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్‌ఎస్‌లో చేరిన వహీద్‌ఖాన్‌కు కాంగ్రెస్ పార్టీ పట్టణంలోని 28వ వార్డు అభ్యర్థిగా ప్రకటించింది. వహీద్‌ఖాన్ కూడా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం..ఇప్పుడేమో టిఆర్‌ఎస్‌లో చేరడం కొసమెరుపు.

