- ఆటా ప్రతినిధుల ఘనస్వాగతం
హైదరాబాద్/వాషింగ్టన్ డీసీ, జూలై 31: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభల్లో పాల్గొనేందుకు అమెరికా పర్యటనకు వెళ్లిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాచందర్ రావుకు వాషింగ్టన్ డల్లాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆటా ప్రతినిధులు మరియు విదేశీ బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
పుష్పగుచ్ఛాలు అందజేసి ఆత్మీయంగా ఆహ్వానించారు. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 19వ మహాసభలు మరియు యూత్ కన్వెన్షన్ కార్యక్రమాల్లో రాంచందర్ రావు గారు విశిష్ట అతిథిగా పాల్గొననున్నారు. ఈ పర్యటన సందర్భంగా ప్రవాస తెలుగు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, యువ నాయకులు మరియు భారతీయ సమాజ ప్రతినిధులతో సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

