Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికా మార్కెట్‌ చరిత్రలో మైక్రోసాఫ్ట్ రికార్డు

అమెరికా మార్కెట్‌ చరిత్రలో మైక్రోసాఫ్ట్ రికార్డు

- 450 బిలియన్‌ డాలర్లు పెరిగిన మార్కెట్‌ విలువ

న్యూయార్క్, జులై 31 : అమెరికా మార్కెట్‌ చరిత్రలోనే మునుపెన్నడూ లేని ఒక అద్భుతమైన రికార్డు నమోదైంది.

టెక్‌ దిగ్గజం మైక్రోసాప్ట్ ఏకంగా ఒక్క రోజులోనే తన మార్కెట్‌ విలువకు దాదాపు 450 బిలియన్‌ డాలర్లు అంటే సుమారు రూ.39 లక్షల కోట్లు పెంచుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. వాల్‌ స్ట్రీట్‌ ట్రేడింగ్‌ చరిత్రలో ఏ ఒక్క నమోదిత కంపెనీ కూడా ఒక్క రోజు ఈ స్థాయిలో మార్కెట్‌ విలువను పెంచుకోలేదు. ఈ సంచలన ర్యాలీతో మైక్రోసాప్ట్.. ప్రముఖ ఏఐ చిప్‌మేకర్‌ 'ఎన్విడియా' ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్‌ లిస్టెడ్‌ కంపెనీగా మళ్లీ తన స్థానాన్ని కైవసం చేసుకుంది. త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి తర్వాత మైక్రోసాప్ట్ షేర్లు ఒక్కసారిగా 9 శాతం పెరిగాయి. ఫలితంగా ఒక్క రోజులోనే పొందిన ఈ అదనపు మార్కెట్‌ విలువ, దక్షిణాఫ్రికా, వియత్నాం, టర్కీ వంటి దేశాల మొత్తం స్టాక్‌ మార్కెట్‌ విలువల కంటే చాలా పెద్దది కావడం విశేషం. ఈ చరిత్రాత్మక ర్యాలీ వెనుక ఉన్న ప్రధాన కారణం మైక్రోసాప్ట్‌కు చెందిన 'అజూర్‌' క్లౌడ్‌ బిజినెస్‌. విశ్లేషకులు ఊహించిన దానికంటే అజూర్‌ క్లౌడ్‌ ఆదాయం మెరుగైన వృద్ధిని కనబరిచింది. గత కొద్ది కాలంగా మైక్రోసాప్ట్ ఏఐ మౌలిక వసతులు, డేటా సెంటర్లు, చిప్‌లపై బిలియన్ల కొద్దీ డాలర్లను గుమ్మరిస్తోంది. ఈ పెట్టుబడులు నిజంగానే లాభాలను తెచ్చిపెడతాయా అనే సందేహాలకు ఈ ఆర్థిక ఫలితాలు స్పష్టమైన సానుకూల సమాధానాన్ని ఇచ్చాయి. రాబోయే తైమ్రాసికంలో కూడా ఏఐ-ఆధారిత క్లౌడ్‌ సేవల డిమాండ్‌ బలంగా ఉంటుందని కంపెనీ వేసిన అంచనాలు నిజమయ్యాయి. కొన్ని నెలలుగా టెక్‌ కంపెనీలు ఏఐ కోసం చేస్తున్న ఖర్చులను తగ్గించుకుంటాయేమోనని ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. అయితే మైక్రోసాప్ట్ సాధించిన ఈ విజయం ఆ అనుమానాలను పటాపంచలు చేసింది. కార్పొరేట్‌ ప్రపంచం ఏఐ సేవలకు భారీగా ఆర్డర్లు ఇస్తోందని, ఆ డిమాండ్‌ను అందుకోగల క్లౌడ్‌ సంస్థలకు ఇది బంగారు అవకాశమని నిరూపితమైంది. మైక్రోసాప్ట్ సాధించిన ఈ రికార్డు వృద్ధి ఎన్విడియా, అమెజాన్‌, ఆల్ఫాబెట్‌ (గూగుల్‌) వంటి ఇతర ఏఐ ఆధారిత దిగ్గజాలపై కూడా మార్కెట్‌ విశ్వాసాన్ని రెట్టింపు చేసింది.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News