Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికాలో ఆదానీపై కేసుల కొట్టివేత

అమెరికాలో ఆదానీపై కేసుల కొట్టివేత

- ఆధారాలు లేవని తేల్చిన న్యాయ శాఖ

న్యూయార్క్, మే 19: అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీలపై ఉన్న కేసులను అమెరికా న్యాయ శాఖ పూర్తిగా కొట్టివేసింది.

యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) సహా పలు ఏజెన్సీలు ఈ కేసులను కొట్టివేశాయి. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని, లంచాలు ఇచ్చినట్లు కూడా రుజువులు లేవని తేల్చింది. భారత దేశంలో ఒక సోలార్ పవర్ అమ్మకాల కాంట్రాక్టును గెలుచుకోవడానికి రూ.2,000 కోట్లకు పైగా లంచాలు ఇచ్చారని, అలాగే పలు దశల్లో అమెరికన్ పెట్టుబడిదారుల నుంచి డబ్బు వసూలు చేశారని అదానీపై అమెరికాలో కేసులు నమోదయ్యాయి. అమెరికాలో ఇలాంటి ఆరోపణలను పూర్తిగా కొట్టివేయడం ఒక అసాధారణ చర్య అని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎస్‌ఈసీ దాఖలు చేసిన కేసును పరిష్కరించుకోవడానికి అదానీ 6 మిలియన్ డాలర్లు చెల్లించడానికి అంగీకరించినట్లు కోర్టు పత్రాలు చూపిస్తున్నాయి. సాగర్ అదానీ కూడా 12 మిలియన్ డాలర్లు చెల్లించడానికి అంగీకరించారు. ఎల్‌పీజీ దిగుమతులకు సంబంధించి ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలను అదానీ గ్రూప్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ (ఓఎఫ్‌ఏసి) దాఖలు చేసిన కేసును కూడా పరిష్కరించారు. ఈ ఒప్పందం 275 మిలియన్ డాలర్లకు కుదిరింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అమెరికాకు చెందిన అజూర్ కంపెనీ తమ సౌర విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ)తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఎసఈసీఐ నుంచే విద్యుత్‌ను కొనుగోలు చేసేలా ప్రభావితం చేయడానికి గౌతమ్ అదానీ నేరుగా జోక్యం చేసుకున్నారు. అప్పటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో అదానీ జరిపిన సమావేశంపై కూడా ఆరోపణలు ఉన్నాయి. నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడైన అదానీకి ఎసఈసీ పంపిన సమన్లను జారీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News