"రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్ ఏర్పాటు చేసి చట్టం తమ పని తాము చేసుకుపోతుంది అని చెప్పడం ద్వారా ఈ మొత్తం సంఘటన లో ఏం సందేశం ఇవ్వదలచుకున్నారో తెలియదు గానీ, సమస్య బిజెపి పార్టీ కి సంభందించిన ప్రముఖ కుటుంబంది అయితే కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం తీరు వలన ఆ పార్టీకి కలిగే రాజకీయ నష్టం ఎక్కువగా ఉంది."
"కంచే చేను మేస్తే కాపేమి చేయును"అనే ఓ ముతకసామెత ఉండేది. బండి భగీరథి కేసులో కనిపిస్తున్న భిన్న కోణాలు,విభిన్న కథనాలు దాన్నే రుజువు చేస్తున్నాయి.మన చట్టాలు అనేవి అధికారం ఉన్నవాళ్ళకు చుట్టాలని,అదే సామాన్యులు విషయానికి వస్తే కష్టాలని మరోమారు నిరూపితం అయ్యింది.బాధితులకు న్యాయం చేయాల్సిన వ్యవస్థలోని చట్టంలో చిల్లులు వెతికి నిందితులను బయటపడేలా చూస్తున్నప్పుడు ఎవరేమి చేయగలుగుతారు.వ్యవస్థ అవస్థను చూసి ఒకవైపు జాలి,మరోవైపు సిగ్గుపడడం తప్ప!

