Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

- అదనపు కట్నం కోసం ఘాతుకం- తీవ్ర గాయాలతో గాంధీలో చికిత్స పొందుతున్న బాధితురాలు
- తల్లికి కూడా అంటుకున్న మంటలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4 అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తూ చివరకు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.

తీవ్రంగా గాయపడిన బాధితు రాలు ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.. పోలీసుల వివరాల ప్రకారం.. మీర్పేట్లోని బాలాజీ టౌన్షిప్కు చెందిన రత్నవత్ అనిత (21)కు లుడావత్ లాలుతో 2023లో ప్రేమ వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. గత రెండు నెలలుగా భర్త అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నాడని అనిత ఆరోపించింది. దీంతో నెల రోజుల క్రితం కుమార్తెతో కలిసి చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీలోని పుట్టింటికి వెళ్లి ఉంటోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 2న లాలు అక్కడికి వచ్చి కుమార్తెను తన వెంట తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఉదయం మళ్లీ అత్తింటికి వచ్చిన లాలు.. సాయంత్రం 3.30 గంటల సమయంలో కుమార్తె ఆచూకీ గురించి అనిత తండ్రి ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మంచం కింద నుంచి పెట్రోల్ తీసి అనిత శరీరంపై పోసి నిప్పంటించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కుమార్తెను కాపాడేందుకు ప్రయత్నించిన అనిత తల్లికి కూడా మంటలు అంటుకున్నాయి. వెంటనే అనిత తండ్రి మంటలను ఆర్చి, ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం గాంధీ హాస్పిటల్‌కుతరలించారు. ప్రస్తుతం అనిత ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి నుంచి మేజిస్ట్రేట్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనిత ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై తదుపరి చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News