Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బ్యాటరీ పేలి బాలుడి మృతి

బ్యాటరీ పేలి బాలుడి మృతి

సిఫాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 23: కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన నికాడి శారద-గణేష్‌ దంపతుల పెద్ద కొడుకు లోకేశ్‌ (14) స్థానిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.

బుధవారం ఉదయం లోకేశ్‌ ఇంట్లో కరెంట్‌ స్విచ్‌బోర్డు వద్ద బ్యాటరీలతో సరదాగా వివిధ ప్రయోగాలు చేశాడు. ఒ కసారిగా పెద్ద శబ్దంతో బ్యాటరీ పేలగా లోకేశ్‌ ముఖం, చేతులు పగిలిపోయి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని సిర్పూర్‌-టీ ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News