Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ధరల పెంపుపై భగ్గుమన్న కాంగ్రెస్

- ఇక సైకిలే దిక్కన్న అఖిలేశ్ యాదవ్

న్యూదిల్లీ, మే 15: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్ప్పున పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకోవడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా తప్ప్పుబట్టాయి.

ఈ క్రమంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఘాటు విమర్శలు చేసింది. 'ద్రవ్యోల్బణ వ్యక్తి మోదీ. ఈరోజు మరోసారి ప్రజలపై కొరడా ఝుళిపించారు' అంటూ తన అధికారిక 'ఎక్స' వేదికగా విమర్శలు చేసింది. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరల పెంపును ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలకు ముడిపెట్టింది. ఎన్నికలు ముగిసిన వెంటనే మోదీ తన వసూళ్లు ప్రారంభించారంటూ ఆరోపించింది. ఎన్నికల తర్వాత ఇంధన ధరలు పెరుగుతాయన్నది ఊహించినదే అంటూ తృణమÖల్ కాంగ్రెస్ దుయ్యబట్టింది. ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను తగ్గిస్తుందా అంటూ పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా కొలువుదీరిన బీజేపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్రం ఇంధన ధరలు పెంచడంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వ్యంగ్యంగా స్పందించారు. 'విÖరు ముందుకు సాగాలంటే సైకిల్ ఒక్కటే ఆప్షన' అని ఎక్స్‌లో పోస్టు పెట్టారు. దీనికి సైకిల్ తొక్కుతూ ఉన్న కేరికేచర్‌ను పంచుకున్నారు. 'సైకిల్‌పైనే ప్రయాణం కొనసాగిస్తామని ఇదివరకే చెప్పాం' అని దానికి ఆయన కేప్షన్ పెట్టారు. సమాజ్‌వాదీ పార్టీ గుర్తు సైకిల్ కావడం గమనార్హం.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News