Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగలం

ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగలం

- జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ ఇళ్లపై ఏసీబీ దాడులు- సోదాల్లో కుప్పలుతెప్పలుగా నగదు, నగలు స్వాధీనం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19: హైదరాబాద్ జలమండలిలో భారీ తిమింగలం పట్టుబడింది.

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన జనరల్ మేనేజర్ కుమార్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా భారీ ఎత్తున నగదు, నగలు, ఆస్తుల చిట్టాలు బయటపడ్డాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ తనిఖీలు చేపట్టారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి హైదరాబాద్‌తోపాటు మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. మల్లాపూర్‌లోని కుమార్ ఇంట్లో ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో తనిఖీలు ప్రారంభించారు. ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగాయి. ఈ తనిఖీల్లో భారీగా నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుప్పలుగా ఉన్న నోట్ల కట్టలు చూసి అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే దర్శనమివ్వడంతో ఆ నగదు లెక్కింపునకు కౌంటింగ్ మెషీన్లను వినియోగించారు. దాదాపు రూ.1.20 కోట్ల నగదు, 1.5 కిలోల బంగారు ఆభరణాలు, 2.5 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్‌లో మÖడెకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో మూడు ఫ్లాట్‌లు, 6 ఓపెన్ ప్లాట్‌లను అధికారులు గుర్తించారు. బ్యాంకు లాకర్లను ఓపెన్ చేసి మరిన్ని ఆస్తులను గుర్తించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. మల్లాపూర్‌లోని కుమార్ నివాసంలో రెండు కార్లను సీజ్ చేశారు. మార్కెట్ విలువ ప్రకారం ప్రాథమికంగా రూ.100 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. గత నెలలో తన కుమార్తె వివాహాన్ని కుమార్ అంగరంగ వైభవంగా జరిపించాడు. వివాహం కోసం కొన్ని కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఆ డబ్బులు ఎలా సంపాదించారనే దానిపై కుమార్ వద్ద నుంచి ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News