హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : ఎస్టీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్(టీజీహెచ్‌ఆర్‌సీ) సుమోటోగా కేసు నమోదు చేసింది.
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఎస్టీ బాలికల వసతి గృహంలో కలుషిత ఆహారం వల్ల 27మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు ఓ పత్రికలో మంగళవారం వార్త ప్రచురితం కావడంపై చైర్‌పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలోని మానవ హక్కుల కమిషన్ స్వయంచాలకంగా (సుమోటోగా) కేసు నమోదు చేసింది. ఘటనకు దారితీసిన పరిస్థితులు, అస్వస్థతకు గురైన విద్యార్థినుల సంఖ్య, వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, వారికి అందించిన వైద్య చికిత్స, వసతి గృహంలో ఆహార నాణ్యత, పరిశుభ్రత, పారిశుధ్యంపై నిర్వహించిన విచారణ ఫలితాలు, బాధ్యులపై తీసుకున్న చర్యలు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకున్న నివారణ, సరిదిద్దే చర్యలపై సమగ్ర నివేదికను సమర్పించాలని వరంగల్ జిల్లా కలెక్టర్‌ను కమిషన్ ఆదేశించింది. సెప్టెంబర్ 7వ తేదీలోగా విచారణ నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ కేసును వాయిదా వేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

