Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గాంధీలో ఏడు రోజుల పసికందు కిడ్నాప్

గాంధీలో ఏడు రోజుల పసికందు కిడ్నాప్

- రూ.లక్షకు విక్రయించేందుకు పథకం- గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన పోలీసులు

సికింద్రాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21 : గాంధీ దవాఖానలో ఏడు రోజుల పసికందు కిడ్నాప్ కాగా, పోలీసుల చర్యలతో నిందితులు దొరికిపోయారు.

కేసును గాంధీనగర్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ బృందాలు సంయుక్తంగా గంటల వ్యవధిలోనే ఛేదించాయి. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. బీహార్ రాష్ట్రం భాగల్‌పూర్‌కు చెందిన సోనీ కుమారి, అమ్రేష్ కుమార్ దంపతులకు ఈ నెల 13న గాంధీ హాస్పిటల్‌లో మూడో కాన్పులో ఆడ శిశువు జన్మించింది. శుక్రవారం డిశ్చార్జ్ అయిన అనంతరం ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఈ కిడ్నాప్ ఘటన చోటుచేసుకున్నట్లు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దంపతులను లక్ష్యంగా చేసుకున్న బోడుప్పల్‌కు చెందిన సామాజిక కార్యకర్త సారగడ హేమలత (43), ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక సాయం ఇప్పిస్తానని నమ్మించింది. అమ్రేష్ కుమార్‌ను దవాఖాన ఎదురుగా ఉన్న శ్రీనివాస్ బేకరీ వద్దకు తీసుకెళ్లి ఆధార్ కార్డు జిరాక్స్ తీయించుకుని రావాలని పంపింది. ఇదే అదనుగా పసికందును ఎత్తుకుని తన బంధువు షేక్ రిజ్వాన్ (31)తో కలిసి స్కూటీపై పరారైంది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు బేకరీతోపాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితులు ఉపయోగించిన స్కూటీ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి హేమలత, రిజ్వాన్‌లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పసికందును విక్రయించేందుకు పథకం వేసినట్లు వెల్లడైంది. నాలుగు నెలల క్రితం పీర్జాదిగూడలోని శ్రీనివాస్ హోమ్స్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న మహమ్మద్ నస్రీన్ (39)తో హేమలతకు పరిచయం ఏర్పడింది. తన చెల్లెలు షేక్ షమీనా బేగంకు పిల్లలు లేరని, చిన్నారిని దత్తత తీసుకోవాలనుకుంటున్నారని నస్రీన్ తెలిపింది. దీంతో పసికందును రూ.లక్షకు అప్పగించేలా ఒప్పందం కుదుర్చుకున్నది. ఇందులో భాగంగా నస్రీన్ ఫోన్‌పే ద్వారా రూ.50 వేలు అడ్వాన్స్‌గా చెల్లించినట్లు విచారణలో తేలింది.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News