Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గోవులను తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి

గోవులను తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి

- డీజీపీ ఆనంద్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18: రాష్ట్రంలో గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు.

ఈ మేరకు డీజీపీ సీవీ ఆనంద్‌కు బహిరంగ లేఖ రాశారు. శనివారం రాత్రి గోవులతో వెళ్తున్న లారీని గో రక్షక్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారని, దీంతో ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అక్కడకు చేరుకుని ఆ లారీని తీసుకెళ్లడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. చట్టం అందరికీ ఒకేలా ఉండాలని, హిందువైనా, ఎంఐఎం నాయకులైనా ఒకే విధంగా చూడాలని అన్నారు. గోవుల అక్రమ రవాణా చేస్తూ బహిరంగంగా తిరుగుతున్న వారిపై వెంటనే కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులు రాజకీయ ఒత్తిడికి లోనుకాకుండా పనిచేయాలన్నారు. హిందువులపై మాత్రమే చర్యలు తీసుకుంటే ప్రజల్లో అనుమానాలు వస్తాయన్నారు. గోమాతను కాపాడాలని చెప్పే ప్రభుత్వం అక్రమ రవాణాను ఎందుకు ఆపడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. డీజీపీ వెంటనే ఈ విషయంపై స్పందించి చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ లేఖలో కోరారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News