Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గురుకులాల్లో సీట్ల భర్తీకి భారీ స్పందన

గురుకులాల్లో సీట్ల భర్తీకి భారీ స్పందన

- ఫేజ్-1లోనే 18,401 సీట్లు భర్తీ- పేదలకు కార్పొరేట్‌స్థాయి విద్య ప్రభుత్వ లక్ష్యం
- సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : దళిత, గిరిజన, బడుగు బలహీనవర్గాల విద్యార్థులకు కార్పొరేట్‌స్థాయి విద్యను పూర్తిగా ఉచితంగా అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కట్టుబడి ఉన్నారని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టీజీఎస్‌డబ్ల్యూఆరఈఐఎస్) ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి సైనిక పాఠశాలలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ), నాన్-సీఓఈ, ఒకేషనల్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను సచివాలయంలో శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026-27కి సంబంధించి ఏప్రిల్ 5న ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేయగా 6 నుంచి మే 25 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 45,357 దరఖాస్తులు అందగా అందులో ఎంపీసీ గ్రూప్‌నకు 21,447, బీపీసీ గ్రూప్‌నకు 17,400, ఎంఈసీ, సీఈసీ, హెచఈసీ గ్రూపులకు 6,510 దరఖాస్తులు వచ్చినట్లు మంత్రి అడ్లూరి తెలిపారు. గురుకుల విద్యాసంస్థల్లో మొత్తం 19,740 సీట్లు అందుబాటులో ఉండగా ఈనెల 15న 117 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 39,052 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఫేజ్-1 అడ్మిషన్లలోనే మొత్తం 18,401 సీట్లు భర్తీ కావడం గురుకులాలపై పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. ఇంకా 1,339 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు.
గ్రూపుల వారీగా సీట్ల భర్తీ వివరాలు
- ఎంపీసీ : 8,440 సీట్లకు గాను 8,156 సీట్లు భర్తీ - 96.63%
- బీపీసీ: 8,280 సీట్లకు గాను 7,425 సీట్లు భర్తీ - 90%
- ఎంఈసీ : 520 సీట్లకు గాను 377 సీట్లు భర్తీ- 72%
- సీఈసీ : 1,520 సీట్లకు గాను 1,500 సీట్లు భర్తీ- 98.68%
- హెచఈసీ : 280 సీట్లకు గాను 257 సీట్లు భర్తీ : 98%
- ఒకేషనల్ కోర్సెస్ : 700 సీట్లకు గాను 686
ఫేజ్-1లో ఎంపికైన విద్యార్థులు అవసరమైన ధ్రువపత్రాలతో జూన్ 7లోపు సంబంధిత కళాశాలల్లో ప్రవేశాలు పూర్తి చేసుకోవాలని మంత్రి అడ్లూరి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. జూన్ 1 నుంచి కళాశాలలు ప్రారంభమవుతున్నందున విద్యార్థులను మొదటి రోజే కళాశాలలకు పంపించాలని కోరారు. సోషల్ వెల్ఫేర్ గురుకులాలు నేడు జాతీయ స్థాయిలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయని మంత్రి తెలిపారు. జేఈఈ మెయిన్ -2026లో 337 మంది విద్యార్థులు అర్హత సాధించగా అందులో 26 మంది 90 శాతంపైగా పర్సంటైల్ సాధించడం గర్వకారణమన్నారు. గత ఏడాది 525 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించడం గురుకుల విద్యా వ్యవస్థ సామర్థ్యానికి నిదర్శనమన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలలు ఐఐటీ-జేఈఈ, నీట్, ఎన్‌డీఏ, క్లాట్ వంటి జాతీయస్థాయి పరీక్షల్లో కార్పొరేట్ కళాశాలలకు పోటీగా ఫలితాలు సాధిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మైక్రో అకడమిక్ ప్లానింగ్, వారానికొకసారి మాక్ టెస్టులు, ప్రత్యేక అకడమిక్ మానిటరింగ్, నిపుణులైన అధ్యాపకులతో ప్రత్యేక శిక్షణ వల్ల ఫలితాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయని మంత్రి వెల్లడించారు. విద్యార్థులకు మానసిక దృఢత్వం, కౌన్సెలింగ్, వెల్‌నెస్ కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇకపై ప్రతి నెలా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి వారి సూచనలు, సలహాలు స్వీకరిస్తామన్నారు. కార్యక్రమంలో ఓఎస్‌డీ వై.జె.విజయ్ కుమార్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి కంభంపాటి శారద, జాయింట్ సెక్రటరీ సక్రు నాయక్, అసిస్టెంట్ సెక్రటరీ మధు నాయక్, డిప్యూటీ సెక్రటరీ సహజ, సూపరింటెండెంట్ మృణాళిని, Uడీపీవో శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News