Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

- ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14: నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సూరారం` కొంపల్లి హైటెన్షన్ రోడ్డులో డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ ఎస్టీఎఫ్‌బీ అధికారులు అరెస్టు చేశారు.

ఇన్నోవా కారులో డ్రగ్స్ తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో కారు ఆపి అధికారులు తనిఖీలు చేపట్టగా డ్రగ్స్ బయటపడింది. నిందితుల నుంచి మÖడు గ్రాములు ఎండీఎంఏ, 36 గ్రాముల ఓజీ కుష్, 7 గ్రాముల చరస్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.2.58 లక్షలు ఉంటుందని అంచనా. బడా బాబుల పిల్లలే టార్గెట్‌గా డ్రగ్స్ అమ్మకాలు జరిపి నిందితులు భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు ఎస్టీఎఫ్‌బీ అధికారులు తెలిపారు. డ్రగ్స్‌ను బెంగళూరు నుంచి కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్‌తోపాటు కారును సీజ్ చేశారు. డ్రగ్స్‌ను ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు, ఎప్పటినుంచి ఈ దందా నడిపిస్తున్నారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుల వెనక పెద్ద ముఠా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News