Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఇందిరమ్మ ఇంటి కోసం మహిళకు వేధింపులు

- కాంగ్రెస్‌ నాయకుడిపై పోలీసు కేసు

కామారెడ్డి, ప్రజాతంత్ర, మే 19: ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని నమ్మబలికి దానికి ప్రతిఫలంగా తన కోరిక తీర్చాలంటూ ఓ మహిళను వేధించిన ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కేంద్రంలో చోటుచేసుకుంది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు రాజంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. రాజంపేట మండల కేంద్రానికి చెందిన ఒక మహిళ ఇందిరమ్మ ఇల్లు కావాలని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ నాయకుడిని సంప్రదించింది. అయితే ఇల్లు మంజూరు చేయాలంటే తన కోరిక తీర్చాలని తనకు లొంగిపోవాలని అతడు ఆమెను తీవ్రంగా వేధించడం ప్రారంభించాడు. ఈ వేధింపులు తట్టుకోలేక బాధితురాలు రాజంపేట పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి రాతపూర్వక ఫిర్యాదు మేరకు కాంగ్రెస్‌ నాయకుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందిరమ్మ ఇంటి విషయంలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు, పలువురిని డబ్బులు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణ రావడంతో బెస్ట్ చంద్రంను పార్టీ అధిష్టానం సస్పెండ్‌ చేసినట్లు రాజంపేట మండల అధ్యక్షుడు కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News