Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జొన్నల కొనుగోలు కోసం ఆందోళన

జొన్నల కొనుగోలు కోసం ఆందోళన

- జాతీయ రహదారిపై రైతుల ధర్నా

నిర్మల్‌,ప్రజాతంత్ర,మే 19: జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలంలోని మార్కెట్‌ యార్డు వద్ద స్వర్ణ-నిర్మల్‌ రహదారిపై రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు.

దీంతో రోడ్డుకు ఇరువైపుల గంటపాటు వాహనాలు ఆగిపోయాయి. ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. తహసీల్దార్‌ విజయ్‌కాంత్‌రావుకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. తహసీల్దార్‌ కలెక్టర్‌ భవేశ్‌మిశ్ర దృష్టికి తీసుకువెళ్లి రెండు రోజుల్లో జొన్నలు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సారంగాపూర్‌ మార్కెట్‌ యార్డులో జొన్నలు పోసి నెల రోజులు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్‌ యార్డులో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి 20 రోజుల క్రితం ప్రారంభించారని, అప్పటి ఇప్పటివరకు గన్నీ బ్యాగులు లేక ఒక గింజ కూడా కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణంలో మార్పుల వల్ల ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండడంతో జొన్నలు తడిసి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News