Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జూన్ 25 నుంచి 'సర్' ప్రక్రియ

జూన్ 25 నుంచి 'సర్' ప్రక్రియ

- ఇంటింటికీ వెళ్లి బీఎల్‌వోల పరిశీలన- సీఈవో సుదర్శన్ రెడ్డి వెల్లడి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16: దేశవ్యాప్తంగా 'సర్' పక్రియ ప్రారంభమైందని, రాష్ట్రంలో జూన్ 25 నుంచి ఈ పక్రియ మొదలవుతుందని సీఈవో సుదర్శన్ రెడ్డి తెలిపారు.

ఇంటింటికీ వెళ్లి బీఎల్‌వోలు ప్రత్యేక సర్వే చేస్తారన్నారు. ప్రతి వోటరుకూ ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తారని, ప్రతి ఇంటినీ కనీసం మూడుసార్లు బీఎల్‌వో సందర్శిస్తారని చెప్పారు. కొత్త వోటర్ల వివరాలను ఫారం-6లో ప్రత్యేకంగా నమోదు చేస్తారన్నారు. వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఎన్యూమరేషన్ అవకాశం ఉందని తెలిపారు. హెల్ప్‌లైన్ 1950తోపాటు కాల్ యువర్ బీఎల్‌వో సదుపాయం కల్పించినట్లు చెప్పారు. ఎన్యూమరేషన్ దశలో ఫారం తప్ప అదనపు పత్రాలు అవసరం లేదని సీఈవో తెలిపారు. ఫారం ఇచ్చిన వారందరి పేర్లు డ్రాప్ట్ వోటర్ల జాబితాలో చేరుస్తారని, ఫారం ఇవ్వని వోటర్ల జాబితా బూత్ వారీగా ప్రదర్శిస్తారని తెలిపారు. డ్రాప్ట్ రోల్స్ తర్వాత అభ్యంతరాలను స్వీకరిస్తామని చెప్పారు. పుట్టిన తేదీ ఆధారంగా పత్రాల సమర్పణకు నిబంధనలు వర్తిస్తాయన్నారు. 1987 జూలై 1కు ముందు పుట్టిన వారికి ఒకే పత్రం సరిపోతుందని, 1987-2004 మధ్య పుట్టిన వారికి తల్లిదండ్రుల వివరాలు కూడా తప్పనిసరి అని చెప్పారు. 2004 తర్వాత జన్మించిన వారికి తల్లిదండ్రుల పత్రాలు తప్పనిసరన్నారు. రాష్ట్రంలో 2002లో 'సర్' చేశారని సీఈవో తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వోటు హక్కు ఉండాలన్నదే ఎస్‌ఐఆర్ ఉద్దేశమన్నారు. రాష్ట్రంలో 3.45 కోట్ల వోటర్లు, 35 వేల పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. పొలిటికల్ పార్టీలకు కూడా దీనిపై సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎన్యూమరేషన్ తర్వాత డ్రాప్ట్ విడుదల చేస్తామని.. అందులో చూసుకొని ఓటర్లు మార్పు, చేర్పులు చేసుకోవచ్చని సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే, జూలై 31న డ్రాప్ట్ వోటర్ల జాబితా విడుదల ఉంటుందని అన్నారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. అక్టోబర్ 1న తుది వోటర్ల జాబితా విడుదల విడుదల చేస్తారన్నారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

--

--

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News