Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు

కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు

- డిప్యూటీ సీఎంకు అహ్వాన పత్రిక అందించిన మంత్రి సురేఖ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం వేదికగా సరస్వతీ నది అంత్య పుష్కరాలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.

ఈ పుష్కరాలలో పాల్గొనాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ప్రజా భవన్‌కు విచ్చేసిన దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ డైరెక్టర్ ఎం.హనుమంతరావు, ఇతర ఉన్నతాధికారులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను వేదోఛ్చారణలతో ఆశీర్వదించారు. సరస్వతీ అంత్య పుష్కరాలను ఈనెల 21 నుంచి జూన్ 1 వరకు 12 రోజులపాటు కాళేశ్వరంలో నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎంకు మంత్రి సురేఖ వివరించారు. 21న ఉదయం 5:43 గంటలకు తొలి పుష్కర స్నానంతో వేడుకలు ప్రారంభమవుతాయని, కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజేంద్ర సరస్వతి స్వామి తొలి పుష్కర స్నానాన్ని ఆచరిస్తారని వారు వివరించారు. త్రివేణి సంగమం వద్ద ప్రతిరోజూ గంగా హారతి నిర్వహిస్తారన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News