Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కవనకదనాన్ని సమఉజ్జీగా నిలిపిన 'విద్యార్థి'

కవనకదనాన్ని సమఉజ్జీగా నిలిపిన 'విద్యార్థి'

"విద్యార్థి జీవితమంతా సమరమే. కవితాకదనరంగాలను అయన సమఉజ్జీగా నడిపారనడంలో అతిశయోక్తిలేదు. ఒకపక్కన దేశ రక్షణలో సాహాసోపేత చర్యలుచేస్తూనే మరోపక్క హృదయాలను కదిలించే కవితలల్లడం ఆయనకే చెల్లింది.

స్థానిక మొదలు అంతర్జాతీయ సమస్యలను, నేలనుండి ఆకాశం వరకు అనేక సన్నివేశాలను తీసుకుని లోతైన అధ్యయనంతో కవితలను చెక్కడంలో ఆయన నేర్పరి. అందుకే ఆయన్ను అభిమానించేవారు 'యుద్ద కవి, సైనిక కవిగా, ఖండాంతర కవిగా, విశ్వకవిగా, నిరాడంబర కవిగా, స్తానిక విశ్వమానవుడు, గ్లోబల్‌పోయెట్‌ లాంటి బిరుదులతో ప్రశంసిస్తున్నారు.."

''విద్యార్థి హై హమ్‌ దోనోభీ / ఇస్‌ రిస్తోం హమ్‌ భాయిభాయి'' అన్నాడు ప్రముఖ ఉర్దూకవి 'షాద్‌' కాళోజీ రామేశ్వర్‌రావు వేలూరి రాములు గురించి. సన్నిహితులకుతప్ప వేలూరి రాములు పరిచయం చాలామందికి తెలియదు. సాహిత్యలోకానికంతా ఆయన 'విద్యార్థి'గానే పరిచయం. నలభై అయిదేళ్ళ ఆయన సాహిత్య ప్రస్థానమంతా 'విద్యార్థి' కలం పేరునే సాగింది. విద్యార్థి స్వయంగా సైనికుడు. వాయుసేనలో సేవలందించినవాడు. 'మిస్సైల్స్- రాడార్స్'లాంటి ఆయుధాల సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవాడు. అయినా యుద్ధాలపట్ల విరక్తిభావం కలవాడు. అంతమాత్రాన యుద్ధమంటే భయపడేవాడుకాదు. అందుకే ఒకదగ్గర ''చావంటే నాకెందుకు భయం/ అపరిమితమూకాదు.. అరుదైనదీకాదు/ జరామరణ భయాతీతంకాదు/ ఎందరెందరినుండి శాశ్వితంగా సెలవు తీసుకున్నాను/ ఇంద్రధనస్సుని భ్రమించి చేరువగాపోతే/ నన్ను బాణంచేసి సరిహద్దులవైపు/ సందించి వదిలిందీ బాణం''అని రాసుకున్నారు. మానవతా ప్రపంచంలో శాంతికితప్ప హింసకు, యుద్ధాలకు తావులేదన్న గౌతమబుద్ధుని భావాజాలాన్ని జీర్ణించుకున్న తాత్వికుడిగా కనిపిస్తాడు విద్యార్థి. 'హింస'కు నిర్వచనమిస్తూ హింసఅంటే కేవలం రక్తపాతాన్ని సృష్టించడమేకాదు. అది అనేక రూపాల్లో ఉంటుంది. మానవజాతి ఆవిర్భావంనుండి సాగుతూనేఉంది. స్వార్థమే అందుకు ప్రధానకారణమని, కు)మతాలు, దేశం, సరిహద్దుల వివాదాలు హింసను ప్రోత్సహించేవేనని, దాన్ని నిషేదించాలన్నదే తన అభిమతంగా చెప్పుకొచ్చినతీరు ఆయన ఉన్నత ఆలోచనలకు అద్దంపడుతున్నది.పేదరికం ఆయన్ను యుద్ధ సైనికుడిగా మార్చిందేగాని, తన ఆలోచనలకు విరుద్ధమైన వృత్తిలో ఇముడలేకపోయాడు. అందుకే 'గన్‌' వదిలి 'పెన్‌ గన్‌'పట్టి సాహితీవ్యాసాంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్న వ్యక్తి విద్యార్థి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News