వరంగల్, ప్రజాతంత్ర, జూలై 31 : కిట్స్ వరంగల్‌లోని స్టాఫ్ క్లబ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్(ఈఈఈ) ప్రముఖ ప్రొఫెసర్ డాక్టర్ వి.రామయ్య, ఎం అండ్ హెచ్ విభాగం ఇంగ్లీష్ సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.మంజులతా దేవి డ్రైవర్ వి.ప్రసాద్‌ల పదవీ విరమణ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి మాట్లాడుతూ ఈఈఈ విభాగాధిపతిగా, డీన్ స్టూడెంట్ అఫైర్స్, ఐఐఐసి ప్రొఫెసర్ ఇన్‌చార్జి వంటి వివిధ హోదాల్లో 32 సంవత్సరాలు ప్రొఫెసర్ రామయ్య సేవలందించారని తెలిపారు. ఆయన తన బాధ్యతలను నిబద్ధత, అంకితభావంతో నిర్వర్తించారని కొనియాడారు. డిపార్టుమెంట్, ఇన్‌స్టిట్యూట్‌కు చేసిన కృషి అద్భుతమైనదన్నారు. డాక్టర్ మంజులతా దేవి లిటరరీ క్లబ్ ఫ్యాకల్టీ ఇన్‌చార్జిగా వివిధ హోదాల్లో సేవలందించగా, వి.ప్రసాద్ చైర్మన్ కెప్టెన్ వి.లక్ష్మీకాంత రావు సమర్థవంతమైన మార్గదర్శకత్వంలో 18 సంవత్సరాలు విజయవంతమైన డ్రైవర్‌గా సేవలందించారని కొనియాడారు. కార్యక్రమంలో 'నిట' వరంగల్ ప్రొఫెసర్ విటి సోమశేఖర్, కిట్స్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.కోమల్ రెడ్డి, కేయÖ ప్రొఫెసర్ సుమలత(ఈఈఈ విభాగాధిపతి), కిట్స్ వరంగల్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎ.శ్రీహరిరావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ పి.రమేష్ రెడ్డి, ఈఈఈ విభాగాధిపతి డాక్టర్ ఎం.నర్సింహారావు, డీన్ అకడమిక్ అఫైర్స్ ప్రొఫెసర్ ఎస్.నరసింహారెడ్డి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎమ్ అండ్ హెచ్ విభాగాధిపతి డాక్టర్ కె.శివశంకర్, డాక్టర్ హెచ్.రమేష్‌బాబు, స్టాఫ్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు, సిఎసఈ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ పి.నిరంజన్, సెక్రటరీ డాక్టర్ ఎ.హరికుమార్, కోశాధికారి డాక్టర్ కెప్టెన్ ఎం.రణధీర్ కుమార్, కిట్స్ అధ్యాపకుల అసోసియేషన్(కిట్‌స్టా) ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కె.శ్రీధర్, కిట్‌స్టా జనరల్ సెక్రటరీ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ శ్రీకాంత్ పబ్బ, ప్రొఫెసర్ రామయ్య భార్య ఉమ, బంధువులు, కిట్స్ పూర్వ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, కుమార్తెలు సాయి చేతన, వైష్ణవి, డీన్లు, అన్ని విభాగాల అధిపతులు, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ పీఆర్వో డాక్టర్ డి.ప్రభాకరాచారి, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని పదవీ విరమణ పొందిన వారి శేష జీవితం ఆనందకరంగా సాగాలని ఆకాంక్షించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

